బోయపాటి ప్రకటిస్తున్న వరుస సీక్వెన్స్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్..!

స్కంద సినిమా విడుదలై థియేటర్‌లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగా… చంద్రముఖి 2 సినిమాతో పోల్చి చూస్తే స్కందా మూవీ బెటర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఇప్పటికే తన డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తుండగా బోయపాటి శ్రీను సైతం ఆయన దారిలో నడుస్తున్నాడు. స్కంద సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా కమర్షియల్ గా ఈ సినిమా సులువుగానే సేఫ్ అవుతుంది. స్కంద సినిమాకు సీక్వెల్ గా స్కంద 2 ఉంటుందని ప్రకటన చేసిన విషయంలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

స్కందా 2 కాకుండా రామ్, బోయపాటి శ్రీను కాంబోలో కొత్త సినిమా వస్తే బాగుంటుందని మరి కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం వల్ల బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుందని బోయపాటి భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బోయపాటి శ్రీనులా మాస్ సినిమాలను తీసే డైరెక్టర్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారని చెప్పొచ్చు. మాస్ ఇమేజ్ కావాలని కోరుకునే హీరోలు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా చేసిన చాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను తర్వాత మూవీ సూర్య హీరోగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది.

ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. సూర్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంచలన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒక్కడైనా బోయపాటి శ్రీను ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. సూర్యతో బోయపాటి శ్రీను చేసే సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తే బోయపాటి శ్రీను తమిళంలో సైతం బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సినిమా సినిమాకు బోయపాటి శ్రీను రేంజ్ అంతకంతకు పెరుగుతుంది.