నా జీవితం ఏంటి ఇలా అయింది..? అనుకోకండి: సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఖుషి సినిమా తో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే సమంత అమెరికాకు వెళ్ళిపోయింది. మయోసటిస్ కు చికిత్స పొందుతూ అక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడ ప్రదేశాలను, ప్రకృతిని ఆస్వాదిస్తూ తన ఎంజాయ్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఇటీవల instagram వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది సమంత. వారు అడిగిన ప్రశ్నలకు ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది.

ఇందులో భాగంగా మీ తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అని అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత ప్రస్తుత ఎలాంటి ప్రాజెక్ట్ లేవని ఇకనుంచి నాకు తగిన కథలను ఎంచుకోవాలని భావిస్తున్నానని కదల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండబోతున్నాను చూద్దాం ఏం జరిగిద్దో అంటూ కామెంట్స్ చేసింది. తర్వాత మరో నేటిజన్ మీ చర్మం ఇంత కాంతివంతంగా ఎలా ఉంది అని అడగగా.. మీరు అనుకుంటున్నట్లు ఏమీ లేదు మయోసైటీస్ కారణంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది.. చర్మ సంబంధ సమస్యలతో ఇబ్బందులు పడ్డ.. విపరీతమైన పిగ్మెంటేషన్ వచ్చింది.. నన్ను గ్లాసిగా చేస్తానని చిన్మ‌యి చెప్పింది. (ఎక్కడ ఉన్నావ్ చిన్మ‌యి) అంటూ సమాధానం ఇచ్చింది.

ఇక మరో నేటిజన్ మీ నుంచి పూర్తి యాక్షన్ మూవీ చూడాలని ఉంది. అనగా నాకు కూడా యాక్షన్ మూవీస్ లో నటించడం చాలా ఇష్టం సిటాడెల్‌ యాక్షన్ మూవీ మీరు చూడవచ్చు. నా పాత్ర హాట్ గా, ఫన్నీగా ఉంటుంది. ఎంతో చాలెంజింగ్ రోల్‌లో నేను నటించాను. ఆ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది భవిష్యత్తులో తప్పకుండా యాక్షన్ మూవీ చేస్తా అంటూ వివరించింది. మీ జీవితానికి సంబంధించిన 3 వాస్తవానికి దగ్గరగా ఉండే అంశాలను చెప్పండి నెటిజన్ ప్రశ్నించగా..1. నేను ఏదైనా సాధిస్తా, 2 ఎంటి ప‌రిస్థితులు ఇలా ఉన్నాయి అని ఆలోచించడం మానేసి యధాతధంగా స్వీకరిస్తా, 3. ట్రూత్ అండ్ హానెస్ట్రీ గా ఉంటా అంటు చెప్పుకొచ్చింది.

జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక బాధపడుతున్న యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటి అని అడగగా చిన్న చిన్న వాటిక నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అనుకోకుండా ఇప్పుడే నా జీవితం మొదలైంది అనుకోవాలి.. ఇంకా ప్రయాణంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురవుతాయి.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి కొన్నిసార్లు అవే మనల్ని రాటు తెలుస్తాయి అనిచెప్పింది.

25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ రేంజ్ లో నేను ఎదుగుతానని నేను అనుకోలేదు.. జీవితంలో ఇన్ని ఇబ్బందులు పడతానని కూడా ఊహించలేదు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగా అని వివరించింది. ఇక సమంత నటించిన సిటాడెల్ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది త్వరలోనే సమంత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.