పుచ్చకాయ అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది వేసవికాలం. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పుచ్చకాయని అధికంగా తింటాం. కానీ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ సంస్థ అధ్యయనం ప్రకారం, పుచ్చకాయ పంటలలో ఒక నిర్దిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
ఆ బ్యాక్టీరియా సహజ చక్కర, ఈస్ట్ అనే పదార్థాలు ఒకే చోట ఉత్పన్నమవుతున్నాయి. దీంతో పుచ్చకాయ ఫార్మెంటేషన్ కు గురవుతుంది. ఆ బ్యాక్టీరియా ఉన్న పుచ్చకాయలు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఉంచితే.. బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

చివరి ఆ పుచ్చకాయలు ఒక్కసారిగా పేలుతాయి. కానీ పుచ్చకాయలు పేలడానికి ఫార్మెంటేషన్ మాత్రమే కారణం కాదని కార్నెల్‌లోని స్కూల్ అఫ్ ఇంటిగ్రేటెవ్ ప్లాంట్ సైన్స్ లో హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ రినర్స్ తెలిపారు. పుచ్చకాయ పేలడానికి బ్యాక్టీరియా లేదా ఫంగల్ అచ్చు వ్యాధి కూడా కారణం కావచ్చన తెలిపారు.