మీ పెదాల‌ని అందంగా మార్చే 2 సింపుల్ టిప్స్ ఇవే..!!

ముఖ సౌందర్యాన్ని పెంచే వాటిలో పెదాలు ముందు వరుసలో ఉంటాయి. పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఆరోగ్యపు అలవాట్లు, పేరుకున్న కాలుష్యం ద్వారా పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి. మీరు ఇలాంటి వాటితో బాధపడుతున్నారా?.. అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాల‌ను వాడినట్లయితే ఇట్టే తగ్గిపోతుంది. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల నూనె ఆరోగ్యానికే కాదు పెద్దలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పెదాల నలుపును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని పెదాలపై అప్లై చేసి కనీసం నాలుగైదు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని వదిలేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే పెదాలపై ఉన్న నలుపు మొత్తం పోతుంది.

అలాగే మిక్సీ జార్ తీసుకుని రెండు మూడు కీర దోసకాయ స్లైసెస్, 10 పుదీనా ఆకులు వేసి మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత పెదాలకి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచుకుంటే చాలు.. ఆ త‌ర్వాత‌ పెదాలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసిన కూడా పెదాలపై ఉన్న నలుపు పోతుంది.