స‌లార్ స‌రికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఫాన్‌ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నాల్ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ స‌లార్‌. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల‌ర్‌గా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రాంచైజ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామంటూ మూవీ టీమ్‌ ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా పడిందని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు సలార్ సరికొత్త డేట్ ఎప్పుడు అనేది అంతం ప్రేక్షకుల్లా ఆసక్తిగా మారింది.

మరో లేటెస్ట్ బజ్‌ ప్రకారం సలార్ రిలీజ్‌కి దీపావళి డేట్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ కి ఈ డేట్ ఫర్ఫెక్ట్ అంటూ మేకర్స్ భావించారట. నవంబర్ 3 లేదా నవంబర్ 10 కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.