ట్రేడ్ వర్గాల టాక్.. స్కంద రిలీజ్ కి లైన్ క్లియర్..

ఇటీవల రిలీజ్ అయిన మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి, జ‌వాన్‌ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం వచ్చిన సినిమాలేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. దీంతో ఈ రెండు సినిమాలకు మరోవారం కలిసి వచ్చినట్లు అయింది. అలాగే ఇంకో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్న స్కంద మూవీకి కూడా లైన్ క్లియర్ అయింది. గతవారం సినిమాల విషయానికొస్తే విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ రిలీజ్ అయింది. ఓ మోస్తారు అంచనాలతో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. కామెడీ కోసం స్క్రీన్ ప్లేను కన్ఫ్యూజ్ చేశారు. దీంతో మార్క్ ఆంటోనీ బాక్సాఫీస్ పై ఊహించిన రేంజ్ లో విజయాన్ని అందుకోలేకపోయింది.

అలాగే రవితేజ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన చాంగురే బంగారు రాజా సినిమా కూడా రిలీజ్ అయింది కానీ ఇది కూడా సేమ్ అదే రిజల్ట్ అందుకుంది. ఫుల్ ఫిల్ కాకుండా ఉన్న క్రైమ్ డ్రామాని ప్రేక్షకులు ఆదరించలేదు. అలాగే సోదర సోదరీమణులారా, రామన్న యూత్ ఎంటర్టైనర్ సినిమాలు కూడా మెప్పించలేకపోయాయి. అభయ్‌ దర్శకత్వంలో అతడే హీరోగా తెరకెక్కిన రామన్న యూత్ సినిమాలో రూరల్ పాలిటిక్స్ టచ్ చేశారు. పొలిటిషన్స్ మాయలో పడి యూత్ ఎలా పక్కదో పడుతున్నారో.. అనే విషయాన్ని రూపొందించారు. ఓ ఫ్లెక్సీ కొంతమంది యువకుల జీవితాన్ని ఎలా మార్చింది అనే కోణాన్ని చూపించారు.

ఈ సినిమా అక్కడక్కడ ప్రేక్షకులను ఆకట్టుకున్న హిట్‌టాక్‌ మాత్రం అందుకోలేదు. బలగం రేంజ్ లో ఈ సినిమా సెన్సేషన్ అవుతుందని భావించిన మేకర్స్‌కు నిరాశ ఎదురయింది. ఇక ఈవారం ఏ సినిమాలు రిలీజ్ లేకపోవడం మరో పది రోజుల్లో థియేటర్స్లోకి రాబోతున్న స్కంద సినిమాకు క్లియర్ అయినట్లుగా చెప్పవచ్చు. అప్పటికి జవాన్ హవా కూడా తగ్గుతుంది కాబట్టి మార్కెట్లో స్కంద మంచి ఫామ్ తో దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇక తన‌ పాన్ ఇండియా కల నెరవేర్చుకోవడానికి రాం పోతినేని కరెక్ట్ టైం ఎంచుకున్నాడు అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.