నా లైఫ్‌లో రష్మి చాలా ఇంపార్టెంట్.. ఫైనల్లీ ఓపెన్ అయిన సుడిగాలి సుధీర్..!!

ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారానే సుధీర్ – రష్మీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ప‌లు షోలలో వీరిద్దరూ కలిసి రొమెంటిక్ పెర్ఫార్మన్స్‌ల‌తో షో సక్సస్ చేశారు. అలాగే 2 సార్లు బుల్లితెర వేదికగా ఉత్తుత్తి పెళ్లి కూడా జరుపుకొని ఈ జంట ప్రేక్షకుల్లో హైలైట్ అయ్యారు. వీరిద్దరూ లవర్స్ అని కూడా జనాలు ఫిక్స్ అయిపోయారు. అందుకే సుదీర్ కనపడితే ఆటోమేటిక్‌గా రష్మీ గురించి మాట్లాడమని.. రష్మీ కనబడితే సుధీర్ గురించి మాట్లాడమని తెగ ఫోర్స్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్.

దీంతో వీరిద్దరూ బుల్లితెరపై జంటగా కనిపించడం మానేశారు. ఇక వీరిద్దరూ చాలా కాలం తర్వాత ఇటీవల జరిగిన ఓ బుల్లితెర షోలో మళ్లీ కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. వారి గతంలో కలిసి చేసిన సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ కి సంబంధించిన వీడియోలు స్క్రీన్ పై ప్రదర్శించారు. రష్మి ఆ వీడియోస్ చూస్తూ ఎమోషనల్ కావడం.. ఆమె కంట్లో నీళ్లు తిరగడం గమనించవచ్చు. ఇక సుధీర్ మాట్లాడుతూ రష్మితో నాది బ్యూటిఫుల్ జర్నీ అంటూ చెప్పుకొచ్చాడు. పక్కనే ఉన్న గెటప్ శీను అందుకుని.. బ్యూటిఫుల్ జర్నీనా.. లేక లవ్ జర్నీ నా.. అని అడిగాడు.

సుధీర్ మాట్లాడుతూ రష్మీ చాలా సెన్సిటివ్ బాగా కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి.. రష్మీ కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. సుదీర్ కామెంట్స్ వీరి బంధం పై మరోసారి అనుమానాలు రేపాయి. ఇక‌ సుధీర్.. రష్మీ విషయంలో, రష్మీ.. సుదీర్ విషయంలో చాలా ఎమోషనల్ గా ఉంటున్నారు. సుదీర్ ఆమె ముఖ్యం అంటూ చెప్పుకొస్తున్నాడు. ఎప్పుడు అడిగినా మా మధ్యన స్నేహం మించి ఏదీ లేదంటూ ఉంటారు. ఇక మీరిద్దరి వయసు 35 ఏళ్లు దాటుతుంది అయినా పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. ఏదో ఒక రోజు మేము పెళ్లి చేసుకుంటున్నామని సర్‌ప్రైజ్ ఇస్తార‌ని అభిమానులు భావిస్తున్నారు.