ధ్రువ సినిమాని మిస్ చేసుకున్న ప్రభాస్.. కారణం అదే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ధ్రువ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ ప్రీతి హీరోయిన్గా నటించింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీస్‌లో ఒక్కటిగా ఈ సినిమా చోటు దక్కించుకుంది. తమిళ్ బ్లాక్ బస్టర్ తని ఒరువ‌న్ రీమేక్ అయిన దర్శకుడు సురేందర్ రెడ్డి దీన్ని తీర్చిదిద్దిన విధానం ఇక్కడ సూపర్ హిట్ అయ్యేలా చేసింది. అయితే ఒరిజినల్ సృష్టికర్త మోహన్ రాజు దీనికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం వివరించాడు. మొదట ఈ కథ రాసుకున్నది ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకొనట.

స్టోరీ చెప్పడం పూర్తయ్యాక తను ప్రస్తుతం ప్రేమ కథ చేసే ఆలోచనలో ఉన్నానని ఇప్పుడు ఈ పోలీస్ డ్రామా చేయన‌ని ప్రభాస్ ఆ అవకాశాన్ని వదులుకున్నాడట. దీంతో మోహన్ రాజు చెన్నైకి తిరిగి వెళ్ళిపోయారు ఈలోగా నాగార్జున ఆజాద్‌ని విజెయ్‌తో తీసే అవకాశం రావడంతో దాన్నే వేలాయుధం పేరుతో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ తను ఎవరెవరినో అడగడం ఎందుకు తమ్ముడు జయం రవితోనే చేస్తే పోలా అని ఆలోచించి వెంటనే ప్రాజెక్టుని సెట్స్‌ఫై కి తీసుకు వచ్చాడట. మోహన్ రాజు కెరీర్‌లోనే మొదటి స్ట్రెయిట్ మూవీ ఇదే.

నయనతారని హీరోయిన్గా తీసుకుని అరవింద్ స్వామిని విలన్ గా చేసి క్రేజీ క్యాస్టింగ్‌తో తక్కువ సమయంలో పూర్తి చేసిన ఆ ఏడాదిలోనే ఈ సినిమా పెద్ద హిట్ సాధించింది. దాన్నే అల్లు అరవింద్, చిరంజీవి చూసి నచ్చడంతో హక్కులను తీసేసుకున్నారు. ఒకవేళ ధ్రువ కనుక ప్రభాస్ చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఊహ ఫ్యాన్స్ ని తెగ బాధ పెడుతుంది. ఎందుకంటే అలాంటి కథలు అరుదుగా వస్తాయి. రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా అన్ని వర్గాలను మెప్పించే స్కోప్ ఉన్నవి రావడం లక్కే.

అయితే తనిఒరువన్ 2 రెడీ చేసిన మోహన్ రాజు దాన్ని మొదటి రాంచరణ్‌కు వినిపిస్తాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మెగా ఫాన్స్ ఒకవేళ నిజంగా కథ బాగుంటే మాత్రం సమాంతరంగా రిలీజ్ చేయడం మంచిదని.. అక్కడ హిట్ అయ్యాక ఇక్కడ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ రీమిక్స్ సినిమాలనే పదం వింటేనే కష్టం అంటున్నారు.