బిగ్‌బాస్ 7లో మాజీ కోడలు సమంత పేరు తీసుకొచ్చిన నాగార్జున‌..!

బిగ్ బాస్ సీజన్ 7 నిన్న రాత్రి 7గం.. గ్రాండ్గా ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 7 ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో గ్రాండ్గా ఓపెనింగ్ జరిగింది. లేటెస్ట్ సీజన్‌కి ఎవరు హోస్ట్ అనే డైలమాకి తెర‌దించుతూ హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు నాగ్. సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ మరింత జోషి ఫుల్ గా చేయడానికి ఈ ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ గా నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. నవీన్ పోలిశెట్టి నటించిన‌ మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు నవీన్. ఇక నాగ్‌.. నవీన్ కి మధ్య ఫన్‌ మాటలు నడిచాయి. ఆ తర్వాత ఖుషి మూవీ తో మంచి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ గా టైటిల్ సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున విజయ్ దేవరకొండ తో మాట్లాడుతూ సమంత గురించి అడగడం ఈ ఎపిసోడ్ కు హైలెట్గా అనిపించింది. ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి కల్పించింది.

మరి తన మాజీ కోడలు గురించి నాగార్జునతో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనతో వర్క్ చేయడం చాలా నచ్చిందని ఆమె డెడికేటెడ్‌గా వర్క్ చేస్తుంది అంటు చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఎపిసోడ్లో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ తమ పర్ఫామెన్స్‌లతో ఆధర కొట్టారు. కచ్చితంగా ఈ సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ అదిరిపోయింది అని చెప్పాలి. మరి ఉల్టా పల్టా నెవ‌ర్ బిఫోర్ సీజన్ అంటూ ప్రమోట్ చేసిన ఈ సీజన్లో కొత్త కొత్తగా ఏం డిజైన్ చేస్తారు ఈ రోజు క‌పిసోడ్‌లో చూడాలి.