అట్లీ, షారుక్ పై నయనతార అసంతృప్తి.. క్లారిటీ ఇదే..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల జవాన్ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇండియన్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. నటిగా దాదాపు రెండు దశాబ్దాల నుంచి రాణిస్తున్న నయనతార 75 సినిమాల్లో అవలీలగా హీరోయిన్ గా నటించింది. అతి తక్కువ సమయంలో ఎన్ని సినిమాల్లో నటించిన రికార్డ్ కేవలం నయనతార మాత్రమే దక్కించుకుంది. ఇటివల జవాన్ సినిమాకు సంబంధించిన ఓ పుకారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జవాన్‌ సినిమాలో ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదని దర్శకుడు అట్లీ నటుడు షారుక్‌లపై నయనతార అసంతృప్తిగా ఉందంటూ పుకార్లు వైరల్ అయ్యాయి. జవాన్ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇది ఇండియాలో ఒకేరోజు రూ.75 కోట్లు వసూలు చేసిందని ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు సాధించిందని సమాచారం. ఇకపోతే జవాన్ సినిమాలో నయనతారకు తగిన ప్రాధాన్యత ఉంది. ఆమెకు యాక్షన్స్ సీన్స్‌ కూడా ఇచ్చారు. మరో విషయం ఏంటంటే నటుడు షారుక్ ఖాన్ అంటే నయనతార కు చాలా అభిమానమట.

 

ఇక అట్లీ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో కథానాయక నయనతారనే. ఆ తర్వాత బిగిల్ చిత్రంలో విజయ్ సారసన నయనతార నటించింది. ఇటీవల జవాన్ సినిమా సక్సెస్ మీట్ కోసం నయనతార భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి ముంబైకి వెళ్లారు. ఇక ఈ జంట విమానాశ్రయంలో వెళుతూ ఉండగా ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలతో కొన్ని ఫొటోస్ తీశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జవాన్ చిత్ర దర్శక, నిర్మాతలపై నయనతార అసంతృప్తి ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది.