లెజెండ్రీ క్రికెటర్ కన్నుమూత.. తీవ్ర బావోద్వేగంలో భార్య.. ట్వీట్ వైరల్..

జింబాబ్వే క్రికెట్ రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ కెప్టెన్ ద గ్రేట్‌ క్రికెటర్ హీత్ స్ట్రీక్‌ కన్నుమూశాడు. క్యాన్సర్ తో పోరాడుతూ(49) చిన్న వయసులోనే హీత్ స్ట్రీక్‌ చివరి శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని అతడి భార్య నడైన్ స్ట్రీక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈరోజు ఉదయం నా జీవితంలో సగం, నా అందమైన పిల్లల తండ్రి మమ్మల్ని విడిచి అందరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతను తన చివరి రోజులను ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో గడపాలని కోరుకున్నాడు. స్ట్రీక్‌ మాతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.

 

స్ట్రీక్‌కి మరో జన్మలో కూడా నేను భార్యగానే పుట్టాలని కోరుకుంటాను అంటూ అతడు భార్య ఎమోషనల్ అయింది. కాగా పది రోజుల క్రితం హీత్ స్ట్రీక్‌ మరణించాడు అంటూ సహ‌చర ఆటగాడు హేన్రీ ఓలంగా అభిమానులను గందరగోళానికి గురి చేసాడు. ఆ తర్వాత మళ్లీ కొద్దిసేపటికి బతికే ఉన్నాడంటూ ట్విట్ చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు. కానీ ఇప్పుడు నిజంగానే హీత్ స్ట్రీక్ లోకాని విడిచిపెట్టి అందరాని లోకాలకు వెళ్లిపోయాడు.

 

కాక జింబాబ్వే క్రికెట్ చరిత్రలోనే హీత్‌ గ్రేటెస్ట్ ఆల్రౌండర్ 1993లో ఈ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన 65 టెస్ట్ మ్యాచ్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు) వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్ సెంచరీలు) కొట్టాడు. ఇలా అతను చివరిసారిగా 2005 లో మ్యాచ్‌ ఆడాడు. స్ట్రీక్‌కి 21 టెస్టులు, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్గా రాణించాడు. 2021లో స్ట్రీక్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎనిమిదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అత‌డిని నిషేదించింది.