మితిమీరిన హైపర్ ఆది చిలిపి చేష్ట‌లు.. ముద్దిస్తే చెపుతా అంటూ..

బుల్లితెరపై ప్రసారమయ్యే డాన్స్ షోలలో డీ ఒకటి. ఎన్నో ఏళ్ల తరబడి ఈ షోని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇస్స‌టివ‌ర‌కు 15 సీజ‌న్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. తాజాగా ఢీ షో ప్రీమియర్ లీగ్ చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. ఈ ప్రీమియర్ లీగ్ షోకు సంబంధించిన ఒక ప్రోమో యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ ప్రోమో రిలీజ్ కాగా ఇందులో దీపిక పిల్లిని హైపర్ ఆది మితిమీరిపోయి కామెంట్స్ చేశాడు. అంతేకాదు చిలిపి చేష్టాల‌తో న‌వ్వించాడు.

ఇక అసలు విషయానికొస్తే ఈటీవీలో ప్రసారమయ్యే డి షో ప్ర‌స్తుతం చాలా ఆశ‌క్తిగా మారింది. లేటెస్ట్‌గా 16వ సీజన్ కోసం నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్‌లో కొన్ని జట్లను ఎంపిక చేశారు. ఇందులో యాంకర్ ప్రదీప్ హోస్ట్‌గా ఉన్నాడు. దీపికా పిల్లే, హైపర్ ఆది తదితరులు మెంటర్స్ డాన్స్ షోలో వ్యవహరిస్తున్నారు. ప్రోమో రిలీజ్ కాగా ఆది కామెడీ ఆకట్టుకుంటుంది. నాలో ఉన్న టాలెంట్ ఎంత చూపించాలి అంటూ ఒక డైరెక్టర్‌గా హైపర్ ఆది ఎంట్రీ ఇస్తాడు. దానికి దీపిక పిల్లి ఏం సినిమా చేసావ్ అంటే.. ముద్దు ఇస్తే చెబుతా అంటాడు.
దీంతో దీపిక పిల్లి ఛీ అంటుంది.. అది సినిమా పేరు అని చెప్పుకొస్తాడు హైపర్ ఆది.

ఈ మాటకు సెట్‌లో వాళ్లంతా నవ్వుతారు.. ఇంత‌లో యాంకర్ ప్రదీప్ ఇంతకీ ఆ సినిమా ఆడిందా అంటాడు. రెండున్నర గంటలు తీసాం రెండున్నర గంటల సినిమా సెన్సార్లో పోయింది అంటూ హైపర్ ఆది చెప్పుకొస్తాడు. మితిమీరిపోయి హైపర్ ఆది వేసిన జోక్‌కి సెట్లో వాళ్లంతా నవ్వుకుంటారు. ప్రదీప్ మాట్లాడుతూ ఇంత కత్తిలాంటి డైరెక్టర్ కంటే కత్తిలాంటి హీరో కావాలి అంటాడు. అప్పుడే పండు ఎంట్రీ ఇస్తాడు. ఇక కొన్ని డాన్స్ పర్ఫామెన్స్ లు కూడా చేస్తారు. వాటికి శేఖర్ మాస్టర్, పూర్ణ జడ్జిమెంట్ ఇచ్చారు వీటన్నిటినీ ప్రోమోలో చూపించారు.