టాలీవుడ్‌లో పెద్ద ఉపాధిహామీ ప‌థ‌కం హీరో గోపీచంద్‌…!

మ్యాచ్ హీరో గోపీచంద్ ఇటీవల రామబాణం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ కాకపోయినా ఓటీటీలో రికార్డ్ వ్యూస్ ద‌క్కించుకుంటుంది. అయితే ఇటీవల గోపిచంద్ ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నాడు. ఇప్పుడు గోపీచంద్ ఫ్లాప్ డైరెక్టర్లకు ఉపాధి హామీ ప్రవేశపెట్టినట్లే అనిపిస్తుంది. ఇప్పటికే శ్రీ‌నువైట్లకు ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో సినిమా సట్స్‌ ఫైకి కూడా వచ్చేసింది. శ్రీ‌నువైట్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హిట్ సినిమాలు తో దూసుకు వెళ్లిన శ్రీనువైట్లకు చాలా కాలం నుంచి ఒక ఖచ్చితమైన హిట్ లేదు.

దీంతో ఏ స్టార్ హీరో అవకాశం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.. అలాంటి టైంలో గోపీచంద్ ఓకే చెప్పాడు. తర్వాత మరో ఫ్లాప్ దర్శకుడికి గోపీచంద్ ఛాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. అతడి పేరే రాధాకృష్ణ. రాదే శ్యామ్ సినిమాతో ప్రభాస్ కు పెద్ద ఫ్లాప్ మిగిల్చిన ఈ దర్శకుడు ఇప్పుడు గోపీచంద్ తో సినిమాను చేయడానికి రెడీ అయ్యాడ‌ట‌. గోపీచంద్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో గోపీచంద్ – రాధాకృష్ణ కలిసి జిల్ సినిమాలు చేశారు. ఇప్పుడు మరోసారి యూవి క్రియేషన్ బ్యానర్ పై వీరిద్దరూ కలబోతున్నారని టాక్. వీరిద్దరు మాత్రమే కాదు ఆల్రెడీ గోపీచంద్ అవకాశం ఇచ్చిన ఇద్దరు దర్శకులు కూడా ఇదే టైప్‌.

ఉదాహరణకు మారుతినే తీసుకుందాం. ఇటీవల మారుతికి గోపీచంద్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే తనకు ఇచ్చిన అవకాశాన్ని మారుతి నిలబెట్టుకోలేదు. కమర్షియల్ హిట్ అవుతుంది అని పెద్ద డిజాస్టర్ ను రుచి చూపించాడు. డైరెక్టర్ శ్రీనివాస్ కూడా అంతే సాక్ష్యం.. అనే సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చి గోపీచంద్ సినిమాతో దర్శకుడిగా మళ్లీ రియంట్రీ ఇచ్చాడు. రామబాణం కూడా థియేటర్స్ వద్ద ఫ్లాప్ గానే నిలిచింది. ఇక మరోసారి కొంతమంది ప్లాప్ డైరెక్టర్లకు గోపీచంద్ అవకాశం ఇవ్వడంతో ఉపాధి హామీ కల్పిస్తున్నాడు అంట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక శ్రీ‌నువైట్ల, రాధాకృష్ణ.. గోపీచంద్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వేచి చూడాలి.