పవన్ కళ్యాణ్ ముందే ఊహించాడా.. భారత్ కామెంట్స్ వైరల్.. (వీడియో)

ఇండియా కాస్త భారత్ గా మారిపోనుందా.. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. దీనికి ముఖ్యమైన కారణం మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అనే జి20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాయడమే. ఇండియా త్వరలోనే మాయం కాబోతుందా.. భారత్‌గా మార్చేందుకు సన్నహాలు జరుగుతున్నాయా.. అనే అనుమానాలు జనంలో మొదలయ్యాయి. జీ20 సమ్మిట్‌ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది మురుమును ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులుగా ది ప్రెసిడెంట్ ఆఫ్ భరత్ అని ప్రింట్ చేయడమే ఈ చర్చల‌కి కార‌ణం.

దీనిపై పెద్ద వివాదమే రేగుతోంది. విపక్షాలు దీని తప్పు పడుతుంటే కొందరు సినీ, క్రికెట్ ప్రముఖులు మాత్రం దీనికి స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇదే టైమ్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చేసిన కొన్ని కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారత్ గురించి ఓ సందర్భంలో ఇలా మాట్లాడాడు. ఇక వివరాల్లోకి వెళ్తే తన అన్నయ్య టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో హాజరైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారత్ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడు ఇండియాను భారత్ అని మారుస్తున్నారన్న దానిపై జోరుగా చర్చ సాగుతున్న టైంలో పవన్ క‌ళ్యాణ్ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ఇంతకీ పవన్ ఏం మాట్లాడాడంటే.. ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు.. భారతదేశం అనేది మనది అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియోను జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ మీడియాని షేర్ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ చర్యవైపు తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తుండగా పవన్ గతంలో చేసిన కామెంట్ల‌కి కూడా నెట్టిజన్‌లు డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు.