వేసవికాలం వెళ్లి వర్షాకాలం రానే వచ్చింది. అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి. వాతావరణం లో వచ్చే మార్పులు, వర్షాల్లో ఎక్కువగా తడవడం లాంటి కారణాల వల్ల జుట్టు అధికంగా రాలడం, చుండ్రు, కురులు డ్రైగా మారడం, చెడు వాసన రావడం తదితర సమస్యలు తయారవుతాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే సొల్యూషన్ ఉంది. ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే ఎటువంటి జుట్టు సమస్య అయినా ఇట్టే తగ్గిపోతుంది.
అదే సమయంలో మరెన్నో లాభాలను సైతం సొంతం చేసుకోవచ్చు. ఆ హెయిర్ వాష్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, రెండు రెబ్బలు వేపాకు, రెండు రెబ్బలు కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ ఎండిన ఉసిరికాయ ముక్కలు, అంగుళం కచ్చాపచ్చాగా దంచిన ములేటి చెక్క, నాలుగు లవంగాలు వేసుకోవాలి. తరువాత రెండు గ్లాసుల వాటర్ పోసి బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకోవాలి.
నానబెట్టుకున్న పదార్థాలను వాటర్‌తో సహా వేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఆపై స్టౌ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ కాస్త గోరువెచ్చగా అయిన తరువాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ వాటర్ ను జుట్టుకి అప్లై చేసి అరగంటసేపు ఉంచుకుని వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలు జుట్టు, ఆరోగ్యంగా, చుండ్రు, లాంటి సమస్యలన్నీ పోతాయి.