ఆంటీ అని బ్యాడ్ గా అనేస్తున్నారు… ప్రగతి ఎమోషనల్… మ‌న‌సులో బాధ చెప్పేసిందిగా…!

ఆంటీ అనే పదాన్ని ఇప్పటి జనరేషన్ తప్పుగా ఉపయోగిస్తుంది అని నటి ప్రగతి అన్నారు. 90% మంది ప్రజలు ఆంటీ అనే పదాన్ని వ్యంగ్యంగానే ఉపయోగిస్తున్నారని ప్రగతి చెప్పింది. ఆంటీ అనే పదం కంటే చెప్పే విధానంతోనే సమస్య అని ప్రగతి అంటుంది.

యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రగతి ఈ వ్యాఖ్యలు చేశారు. తను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నానని.. 200% కర్మ సిద్ధాంతం ఉందని ప్రగతి చెప్పుకొచ్చింది. ప్రగతికి కోపం ఎక్కువ‌ననే.. మాటకంటే ముందు చెయ్యి వెళ్తుందని సరదాగా చెప్పింది. మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదా అని ప్రశ్నించగా… మళ్లీ పిల్లలని కాని అదంతా అంటూ కట్ చేసేసింది.

సినిమా వాళ్లకి డబ్బులు బాగొవస్తాయి కదా అని అడిగితే.. అంతకంత మెయింటినెన్స్ అవుతుందని చెప్పింది. సమాజంలో ఒంటరి మహిళలు పడే బాధలు, వాళ్లకి మగవాళ్లు నుంచి వచ్చే ప్రెజర్స్ గురించి వివరించింది. ఏదేమైనప్పటికీ ప్రగతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.