ఓ మనిషి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్.. ఎక్క‌డో తెలుసా..!

యాపిల్ వాచ్ ఇది స్టైల్ కోసం చాలామంది వాడుతూ ఉంటారు. కానీ దీనివల్ల ఓ మనిషి ప్రాణాలు నిలబడ్డాయని తెలుసా? ఓ యాపిల్ వాచ్ మనిషి ప్రాణాలను కాపాడిందంటే నమ్ముతారా? ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోకి విస్కాన్సిన్ ప్రాంతంలో గురువారం యాక్సిడెంట్ చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో కారు అతివేగంతో పల్టీలు కొడుతూ.. చాలా దూరం వెళ్ళింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అపస్మారక స్థితిలో కి వెళ్ళగా.. అతడి చేతికి ఉన్న యాపిల్ వాచ్ అతని ప్రాణాలను నిలబెట్టింది. వాచ్ లో ఉన్న క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఆక్టివేట్ అయ్యి ఎమర్జెన్సీ 911 నెంబర్ కు కాల్ వెళ్ళింది.

దీంతో అప్రమత్తమైన సిబ్బంది వాచ్ ఇచ్చిన లొకేషన్ అధారంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేవలం యాపిల్ వాచ్ ఉండటం వల్లే అతడికి పునర్జన్మ లభించింది.