సౌత్ ఇండియాలో అనిరుద్ హవా… చేతిలో ఏకంగా ఎన్ని సినిమాలంటే..!!

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈయన మ్యూజిక్ అందించిన సినిమాలు దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో దర్శక నిర్మాతలు వారి సినిమాల్లో సంగీతాన్ని సమకూర్చడానికి అనిరుద్ ని ఎంచుకుంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడి చేతిలో ఉన్న సినిమాల గురించి సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘ లియో’. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ దేవర ‘. కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘ ఇండియన్ 2 ‘ మూవీ.

అలాగే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమా, రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న తలైవార్ 171 సినిమాకి కూడా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అంతేకాదు..హీరో అజిత్ ‘ విడముయరచి అనే సినిమాకి కూడా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.