విజయ్ దేవరకొండ పెళ్లి ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన విజ‌య్‌..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ పెళ్లి వార్తలపై నీతోనే డాన్స్ రియాల్టీ షో ఫైనల్ లో విజయ్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. త్వరలోనే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలిపాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకులం ముందుకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నీతోనే డాన్స్ ఫైనల్ ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.

ఈ ఫైనల్ లో పెళ్లి గురించి శ్రీముఖి అడిగిన ప్రశ్నకు విజయ్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపాడు. పెళ్లి విషయంలో తనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని విజయ్ అన్నాడు. మనవాళ్లు కావాలని అమ్మానాన్న అడుగుతున్నారని విజయ్ అనగానే… తల్లిదండ్రుల కోరుకున్న సంతోషాన్ని వారికి అందివ్వమని విజయ్ కి సీనియర్ హీరోయిన్ రాధ సలహా ఇచ్చింది.

పెళ్లిలో నాకు హ్యాపీనెస్ ఉండదనిపిస్తుంది అందుకే వాళ్ళని మళ్లీ పెళ్లి చేసుకోమని చెబుతున్న అంటూ రాధకు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ తరువాత పెళ్లి గురించి అందరితో మాట్లాడుతున్నానని విజయ్ అనగానే ఒకేసారి అందరినీ పెళ్లి చేసుకోలేం కదా అంటూ శ్రీముఖి చేసిన సెటైర్ నీతోనే డాన్స్ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండ నటించిన ఖుషి మూవీ వచ్చేనెల ఒకటన రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా సమంత నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మొస్తుంది. ఖుషి తో పాటు గౌతమ్ తిన్ననూరి, పరశురాములతో సినిమాలు చేయబోతున్నాడు విజయ్.