సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌తో.. త‌న బైక్స్ అన్ని అమ్మేసిన క్లోజ్ ఫ్రెండ్….!!

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు అతనికి ఏమి జరగకూడదని కోరుకున్నారు. ఈ యాక్సిడెంట్‌తో తన దగ్గర ఉన్న అన్ని బైక్స్ అమ్మేశాడు సాయి ధరంతేజ్ ఫ్రెండ్ నవీన్. అతడు మరెవరో కాదు. నటుడు నరేష్ కొడుకు. సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 2021లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొన్ని వారాలపాటు కోమాలో ఉన్నాడు. తర్వాత ఎట్టకేలకు కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నాడు.

ఇప్పుడు అతని స్నేహితుడు నవీన్ విజయ్ కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత అతని దగ్గర ఉన్న బైక్స్ అన్ని అమ్మేశాడట. తాజాగా నవీన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి వివరిస్తూ నవీన్ భావోద్వేగానికి గురయ్యాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నా జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది.

జీవితంలో బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పింది అని నవీన్ అన్నాడు. యాక్సిడెంట్ ముందు మేమిద్దరం కలిసే తిరిగేవాళ్లం. నన్ను మా ఇంటి దగ్గర దింపేసి తను వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. అప్పుడు ప్రమాదం జరిగింది. అతనికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రాగానే చిన్న యాక్సిడెంట్ అనుకున్నాను. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి చూసి షాక్ అయ్యాను. ఈ ప్రమాదం నాకు గొప్ప పాఠాన్ని నేర్పింది. జీవితంలో ఎంత బాధ్యతగా ఉండాలో నేర్పిందని నవీన్ చెప్పుకొచ్చాడు. సాయి ధరమ్ తేజ్ కి జరిగిన ప్రమాదం గురించి చాలా బాధపడ్డాను. కొన్ని రోజులు ఎవరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు అని నవీన్ బాధపడ్డాడు. నా బైక్స్ అన్ని అమ్మేశానని వెల్లడించాడు.