ఏ సినిమాకి అయినా మొదటి కలెక్షన్లు అనేది చాలా ముఖ్యం. ఓపెనింగ్ ను బట్టి సినిమా థియేటర్స్ వద్ద ఎంతవరకు రికవరీ చేయగలదో అనేది తెలిసిపోతుంది. దర్శక నిర్మాతలు కూడా మొదటి రోజు సాధ్యమైనంత వరకు ఎక్కువగా రికవరీ చేసుకోవాలని భావిస్తారు. అందుకోసం తమ సినిమాని భారీగా వేల కొద్దీ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
మొదటిరోజు కలెక్షన్స్ కి టాక్ తో ఎక్కువ సంబంధం ఉండదు. ముందు నుంచి ఆ సినిమాపై ఏర్పడిన హైప్ వల్లే… ఫుట్, ఫాల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎన్నో సినిమాలు భారీ ఓపెనింగ్ ను సాధించాయి. ప్రభాస్ ఆదిపురుష్, షారుక్ ఖాన్ పఠాన్ సినిమాలు అయితే మొదటి రోజే రూ. 100 కోట్లు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చాయి. ఒక రాజమౌళి సినిమాలకు తప్ప ఈ రేంజ్ కెపాసిటీ సాధించే అవకాశం వేరే సినిమాలు కి ఉండకపోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే 2023లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. ఆదిపురుష్:
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 137 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్‌ను దక్కించుకుంది ఈ సినిమా.
2. పఠన్:
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠన్ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 105 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
3. జైలర్:
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మొదటి రోజు ఏకంగా రూ. 91.20 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
4. పిఎస్2:
మణిరత్నం తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ మొదటి రోజు రూ. 59.12 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
5. గద్దర్ 2:
సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు రూ. 53.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
6. వీర సింహారెడ్డి:
నందమూరి నటసింహం హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు రూ. 50.10 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
7. వాల్తేరు వీరయ్య:
మెగాస్టార్ చిరంజీవి రవితేజ కాంబోలో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు రూ. 49.10 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
8. బ్రో:
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు రూ. 48.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
9. వారసుడు:
విజయ్ వంశీ పైడిపల్లి పంబోలో రూపొందిన ఈ చిత్రానికి దిల్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి రోజు రూ. 47.52 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
10. తెగింపు:
అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు రూ. 41 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.