అన్నలు కాకుండా తమ్ముళ్లు హీరోలుగా సక్సెస్ అయిన టాలీవుడ్ కుటుంబాలు ఏమిటో తెలుసా..!?

మన టాలీవుడ్ లో ఎన్నో బడా ఫ్యామిలీలు ఉన్నాయి. ఇక ఆ ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలుగా అడుగుపెట్టారు.. ఇదే సమయంలో ఇలా ఈ ఫ్యామిలీల నుంచి అన్నయ్యలు సక్సెస్ అవ్వలేక తమ్ముళ్లు మాత్రమే సక్సెస్ అయ‌న‌ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా మన టాలీవుడ్ లో ఘట్టమనేని ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు.. సినిమాల్లో హీరోగా అంతగా సక్సెస్ అవ్వలేకపోయాడు.. అందుకే కొన్ని సినిమాలు చేసి చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకున్నాడు.

రమేష్ బాబు సరిగా సక్సెస్ కాకపోవటం వల్ల ఈ ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు తమ్ముడు సూపర్ స్టార్ కృష్ణ రెండో కొడుకు మహేష్ బాబు మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగి సూపర్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే రాజమౌళి డైరెక్షన్లో గ్లోబల్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నాడు. వీరి తర్వాత టాలీవుడ్ దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకులైన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ ఇద్దరు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

కానీ అందులో ఆర్యన్ రాజేష్ అంతక సక్సెస్ అవ్వలేకపోయాడు. కానీ అల్లరి నరేష్ మాత్రం కామెడీ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కామెడీ సినిమాలతో పాటు సీరియస్ సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆర్యన్ రాజేష్ కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు. అలాగే నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత అయ‌న పెద్ద కొడుకు హరికృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 

కానీ హ‌రికృష్ణ ఆయన కెరీర్‌లో అతి తక్కువ సినిమాలు చేసి ఇండస్ట్రీలో అంతగా ఇమేజ్ తెచ్చుకోలేకపోయాడు.. ఆయన తర్వాత ఎన్టీఆర్ నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ తన తండ్రితో కలిసి 12 సినిమాలకు పైగా కలిసి నటించి నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే ఈ కుటుంబం నుంచి హరికృష్ణ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వీరిద్దరిలో ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకునీ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. కళ్యాణ్ రామ్ కూడా సినిమాలతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తూ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు.