ప్రేమికుడి కోసం రు. 2 వేల కోట్ల ఆస్తి వ‌దులుకున్న ప్రియురాలు… వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ్‌..!

ఈ జ‌న‌రేష‌న్‌లో చాలా మంది యువ‌కులు ఒకరితో ఒకరు ప్రేమలో పడి మోసపోవడం చూస్తూనే ఉన్నాం. మరొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇదే ట్రెండ్ గా పాటిస్తున్నారు చాలామంది కుర్రకారు. కానీ ఈ రోజుల్లో కూడా నిజమైన ప్రేమ ఉందని ఓ జంట నిరూపించారు. మనీ కంటే తను ప్రేమించిన వ్యక్తి కావాలంటూ కోట్లాది ఆస్తి కంటే బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండటమే బెటర్ అని నిర్ణయించుకుంది ఓ యువ‌తి. మలేషియాకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా ఫౌలిన్‌చై దంపతుల కుమార్తె ఏంజలీనా పై చదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరింది.

ఆ టైంలో ఏంజలీనా జెడిడియా ఫ్రాన్సిస్ అనే యువకుడితో ఫ్రెండ్షిప్ చేసింది.. అది కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కావాలనుకున్నారు. ఈ విషయాన్ని ఏంజలీనా తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే జెడిడియా ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడనే ఉద్దేశంతో వారిద్దరి ప్రేమను ఏంజలీనా తల్లిదండ్రులు అంగీకరించలేదు. మా మాట కాదని వాడిని పెళ్లి చేసుకుంటే మా ఆస్తిలో ఒక్క చిల్లి గవ్వ కూడా నీకు దక్కదని తెల్చి చెప్పేశారు.

దీంతో ఏంజలీనా నాకు మీ ఆస్తి కంటే నేను ప్రేమించిన వాడితో జీవితం గడపడమే ముఖ్యం అంటూ సుమారు రూ.2,480 కోట్ల ఆస్తిని వదులుకొని జేడీడియాతో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. ఇక అత‌ని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఏంజలీనా తల్లిదండ్రులకు దూరంగా జెడిడియాతో క‌లిసి ఉంటుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వరల్డ్ ఫేమస్ లవ్ అంటే ఇదే అంటూ.. బాయ్ ఫ్రెండ్ కోసం అన్ని వేల కోట్ల ఆస్తిని వదులుకున్నావా నువ్వు గ్రేట్‌ అంటూ.. ప్ర‌సంసిస్తున్నారు నెటిజ‌న్‌లు.