ఒక‌ప్ప‌టి హీరోయిన్‌ శోభన పెళ్లికి దూర‌మ‌వ్వ‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మ‌యా…!

సిల్వర్ స్క్రీన్ స్టార్ యాక్ట్రస్ శోభన. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది శోభన. 1984లో మొట్టమొదటిసారిగా శ్రీమతి కానుక సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటి చూడడానికి అచ్చు తెలుగు ఆడపిల్లల కనిపించే మలయాళీ అమ్మాయి. ఈమె నాట్యరంగంలో ప్రత్యేక ప్రావీణ్యత పొంది ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇంత పాపులారిటీ దక్కించుకున్న శోభన సినీ కెరీర్ లో సక్సెస్ అయిన విధంగా పర్సనల్ లైఫ్ లో సక్సెస్ కాలేక పోయింది.

50 ఏళ్ళు వచ్చిన శోభన పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. అయితే దానికి కారణం ఓ స్టార్ హీరో అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. శోభన మలయాళ ఇండస్ట్రీలో నటిస్తున్న టైం లో ఓ స్టార్ హీరోను ప్రేమించిందట. అతడు మోసం చేయడంతో ఆమెకు ప్రేమ పై నమ్మకం పోయిందట‌ అప్పటినుంచో ఎవరిని ప్రేమించకూడదని నిర్ణయించుకుందట. దాంతో ఇప్పటివరకు ఆమె ఎవరిని తన లైఫ్ లోకి రానీయకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతుంది.

తన కెరీర్ లో ఎన్నో హిట్స్ సినిమాల్లో నటించిన శోభన సెకండ్ ఇన్నింగ్స్ లో మోహన్ బాబుతో గేమ్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో పలువురికి నాట్యం నేర్పుతూ లైఫ్ లో ఎవరో ఒకరు తోడు ఉండాలని ఉద్దేశంతో ఒక చిన్న పాపను దత్తత తీసుకొని ఆమె బాగోగులన్ని తానే చూసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుత గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన‌ శోభన గురించి ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.