సాయి ధరంతేజ్ కోసం ఫ‌స్ట్ టైం అలా చేయ‌బోతోన్న రామ్‌చ‌ర‌ణ్‌..!

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంతోమంది స్టార్ హీరోస్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక ఓ స్టార్ హీరో సక్సెస్ కావడం కోసం ఆ ఫ్యామిలీలోని ప్రతి హీరో తాపత్రయ పడుతూ ఉంటారు. అలా మెగా ఫ్యామిలీ లో ఏ హీరో మూవీ ప్రమోషన్స్ కు సహాయం కావాలన్నా మరో మెగా హీరో కచ్చితంగా సహాయం చేస్తూ ఉంటాడు. వారి మూవీ పై ప్రమోషన్స్ లో వివ‌రించి సినిమాపై హైప్‌ పెంచుతూ ఉంటారు.

ఇక విషయానికొస్తే మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో కథలను ఎంచుకుంటూ హిట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఇటీవల
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోల్ ఆఫ్ సత్య అనే మ్యూజికల్ షార్ట్ ఫిలిం లో నటించాడు.

అత‌డి స్నేహితుడు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ఈ షార్ట్ ఫిలిం వీడియోకి సింగర్ శృతిరంజని సంగీతం అందించింది. ఇందులో సాయి ధరమ్‌తేజ్‌కు జోడిగా కలర్ స్వాతి కనిపించింది. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా సోల్ ఆఫ్ సత్య పాటను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు రామ్ చరణ్ ఈ పాట‌ని లాంచ్ చేయబోతున్నట్టు శ్రీ వెంకటేశ్వర థియేటర్ క్రియేషన్స్ బ్యానర్ వారు వెల్లడించారు. ఇక రామ్ చరణ్ అలా మరో హీరో మూవీ సాంగ్ లాంచ్ చేయడం ఇదే మొదటిసారి.