” జైలర్ “తో చేయి కలిపిన ” సలార్ “… ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా…!

ఈరోజు కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ గత ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. అన్నాత్తే సినిమాతో చివరగా ఫ్యాన్స్ ని పలకరించిన రజిని, ఈరోజు జైలర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన మోస్ట్ అవైట్డ్ సినిమా హ్యూజ్ హైప్‌ ని క్రియేట్ చేస్తూ థియేటర్స్ లో సందడి చేస్తుంది. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని సెంటర్స్ లో జైలర్ మార్నింగ్ షోస్ పడిపోయాయి.

రజినీకాంత్ ని జైలర్ గా చూసి ఎంజాయ్ చేయాలి అనుకున్న ఫాన్స్ కి సలార్ కూడా కనిపించడంతో థియేటర్స్ మారుమోగిపోతున్నాయి. జైలర్ ఇంటర్వెల్ కి సలార్ టీజర్ అటాచ్ చేశారు, దీంతో సలార్ టీజర్ ని బ్లాక్ స్క్రీన్ పైన చూసి డార్లింగ్ ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ ని రెబల్ స్టార్ ని చూస్తూ ఫాన్స్ మరింత జోష్ లోకి వచ్చారు. ప్రభాస్ బుజ్జిగాడు చిత్రంలో రజనీకాంత్ ఫ్యాన్ గా నటించాడు.

బయట కూడా చాలా సార్లు సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టం అనే విషయం ప్రభాస్ చెప్తూ ఉంటాడు. అందుకే ప్రభాస్ అంటే రజినీకాంత్ కి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. జపాన్లో, రజిని తర్వాత ఆ రేంజ్ క్రేజ్‌ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే. ఒకప్పుడు రజిని మైంటైన్ చేసిన క్రేజ్ ని ఇప్పుడు ప్రభాస్ మైంటైన్ చేస్తున్నాడు. ఇద్దరూ చాలా సింపుల్ గా అనుకూలంగా తన పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా ఎన్నో సిమిలారిటీస్ ప్రభాస్ అండ్ రజిని మధ్య ఉన్నాయి.