షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ జవాన్ ‘. అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత షారుక్ నటిస్తోన్న జవాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దీపిక పదుకొణే గెస్ట్ రోల్ చేస్తుంది.
విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్టర్ల రెమోనరేషన్లు హిందీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లేడీ సూపర్‌స్టార్ నయనతార రూ. 11 కోట్లు, దీపిక రూ. 17 కోట్ల నుంచి 20 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
అలాగే విలన్ పాత్రను పోషిస్తున్న విజయ్ సేతుపతి రూ. 21 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇది పక్కన పెడితే రిలీజ్ కు ముందే ఈ సినిమా రూ. 400 కోట్లు వరకు ఫ్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు బాలీవుడ్ ట్రేడ్ వార్తలు చెప్తున్నాయి.