నాగార్జున బిగ్ బాస్ 7 రెమ్యూనరేషన్ ఎంతో తెలుస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!

బిగ్ బాస్ సీజన్ 7 కు ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ 3 ఆదివారం రాత్రి నుంచి బిగ్ బాస్ ఆట ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. దాదాపు ఇదే తేదీ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 16 మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ సీజన్ కొనసాగనుంది. మరోసారి నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు. 3 సీజన్ నుంచి వరుసుగా 7 సీజన్ వరకు ఓటీటీతో కలిపి మొత్తం 5 సీజన్ కి నాగార్జున హోస్టింగ్ చేయడం విశేషం. ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా… రెండో సీజన్ కి నాని హోస్టింగ్ చేశాడు. ఇక 3 టూ 6+ సీజ‌న్‌ల‌కి నాగార్జున హోస్టింగ్ చేశాడు.

7 సీజన్ కు కూడా నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్ కి సంబంధించిన రెండు ప్రోమోలతో నాగార్జున సందడి చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి నమ్మశక్యం కాని పోస్ట్లు దర్శనమిచ్చాయి. బిబి సీజ‌న్7కి నాగార్జున ఏకంగా రూ. 200 కోట్లు తీసుకుంటున్నార‌ట‌. నిజంగానే రూ. 200 కోట్లేనా? ఓ సున్నా ఎక్కువ వేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగులో ఇప్పటివరకు హెయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హోస్టి గా నాగార్జునకి హిస్టరీ ఉంది. సీజన్ 3కి దాదాపు రూ. 5 కోట్లు తీసుకున్నారని అప్పటికి అదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అనీ వార్తలు వినిపించాయి.

మొత్తం 15 వారాలకు గాను… ఆయన కనిపించేది వారంలో రెండు రోజులు. శని, ఆదివారాలు. నాలుగు ముక్కలు చెపుతాడు… చెవిలో బిగ్ బాస్ డైరెక్టర్ చెప్పిందో… లేదా పేపర్ పై రాసిచ్చిందో చదివేసి వెళ్ళిపోతాడు. అందుకు గానూ నాగార్జున ఎపిసోడ్ కి రూ. 12 కోట్లు చర్చ్ చేస్తాడని టాక్ ఉంది. ఆ లెక్కన చూస్తే…. మొత్తం 15 వారాలు… ఇతర ప్రోమోలు…. స్పెషల్ ఎపిసోడ్స్…. ప్రమోషనల్ కార్యక్రమాలు ఇవన్నీ కలిపి మొత్తం సీజన్3కి రూ.5 కోట్లు తీసుకున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన సీజన్1కి అత‌డి రెమ్యూనరేషన్ రూ.2.50 కోట్లని టాక్. ఈ సీజన్ 70 రోజులే కావడంతో ఎన్టీఆర్‌కి తక్కువ ముట్టింది.

ఆ తర్వాత 2 సీజన్‌కి నాని మొత్తం 106 రోజులు హోస్టింగ్ చేయగా ఆయనకి ముట్టింది రూ3. కోట్లు మాత్రమే. ఇక సీజన్ 4 కి వచ్చేసరికి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఈ సీజన్ నాగార్జునకి 8-10 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఏకంగా 200 కోట్లు భారీ రెమ్యూనరేషన్ అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజానికి సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో నాగార్జున పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందువల్ల దాదాపు రూ. 20 కోట్లే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఏకంగా రెండు వందల కోట్లు అంటూ ప్రచారం నడుస్తుంది. సీజన్ 7 కి సంబంధించి నాగార్జున రెమ్యూనిరేషన్ రూ. 20 కోట్లకు దాటే అవకాశం లేదు. ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీస్ మాత్రం అసలు రెమ్యూనిరేషన్ ఎంత అనేది మాత్రం గుట్టుగానే ఉంచుతారు. కాబట్టి ఈ లెక్కలన్నీ ఉల్టా పల్టానే.