బాక్సాఫీస్ వార్‌లో నాగ్‌, బాలయ్య, పవన్… ఎవరిది పై చేయి..!?

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ వార్‌లో దిగితే థియేటర్ల‌ దగ్గర ఉండే సందడి మరో లెవల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వార్‌లో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వారంలో ఏకంగా ముగ్గురు అగ్ర హీరోల సినిమాలో రీ రిలీజ్ అవటం మరో విశేషం.. ప్రేక్షకులు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో మన్మధుడు కూడా ఒకటి.. అక్కినేని నాగార్జున హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రస్తుత స్టార్‌ డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు అందించారు.

2002 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 20 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలో, ఓటిటిలో ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో వచ్చే లవ్ సీన్స్, కామెడీ సీన్స్, మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 29 అనగా ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. అలాగే నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎవర్గ్రీన్ క్లాసికల్ హిట్ సినిమాల్లో భైరవద్వీపం కూడా ఒకటి.

సీనియర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ జానపద చిత్రంలో రోజా హీరోయిన్ గా నటించింది. 1994 ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చిన ఈ సినిమా వారికి కొత్త అనుభూతిని పంచి ఎంతో అమితంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో బాలయ్య కురుపిగా నటించాడు. ఇప్పుడు ఈ సినిమా 29 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ క్లాసికల్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోగా బాలకృష్ణ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 30న ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్- మీరా జాస్మిన్ జంటగా నటించిన గుడుంబా శంకర్ సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ సినిమాకి వీరశంకర్ దర్శకత్వహించారు. 2004 సెప్టెంబర్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా మిగిలింది. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్, కామెడీ సీన్స్‌ మణిశర్మ మ్యూజిక్ ఫ్యాన్స్‌నీ బాగా అలరించాయి. ఇప్పుడు 19 సంవత్సరాలు తర్వాత మరోసారి ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ విధంగా ఒకే వారంలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతున్నయి. మరి వీటిలో ఏ సినిమా వసూళ్ల పరంగా పై చేయి సాధిస్తుందో చూడాలి.