6 వ రోజు బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తున్న జైలర్..!!

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టిస్తోంది.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.. ఈ చిత్రంలోని రజనీకాంత్ నటన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. విడుదలైన అన్ని భాషలలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నది.. ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే పలు రికార్డులను సైతం క్రియేట్ చేసింది. మొదటి రోజే రూ.93 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టిన జైలర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రూ .10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది..

ఇక ఈ సినిమా విడుదలైనప్పటికి ఆరు రోజులు అవుతున్న ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం… నైజాం -13.23 కోట్లు.. సీడెడ్ 3.74 కోట్లు.. ఉత్తరాంధ్ర -3.62 కోట్లు.. గుంటూరు-2.09 .. ఈస్ట్ -1.82 కోట్ల రూపాయలు. వెస్ట్ -1.13 కోట్లు నెల్లూరు 89 లక్షలు ఇలా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకొని రూ.28.35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ ను రాబట్టినట్లు తెలుస్తోంది..

జైలర్ సినిమా తెలుగులో బిజినెస్ భారీగానే జరిగింది తెలుగులో ఏకంగా రూ.11.8 కోట్ల రూపాయల దియేట్రికల్ బిజినెస్ జరగగా.. జైలర్ సినిమా మూడు రోజులలోనే బ్రేక్ ఈవెంట్స్ ని క్రాస్ చేసింది.. ఇప్పటికే ఈ సినిమా రూ.16.15 కోట్ల రూపాయల వరకు లాభాన్ని తెచ్చి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా రూ.412 కొట్లు వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది బాక్సాఫీస్ వద్ద ఆరు రోజులకే విక్రమ్ సినిమా రికార్డును సైతం బద్దలు కొట్టింది జైలర్ సినిమా..