పాలను ఎప్పుడు ? తాగాలి.. ఉద‌యం బ్రేక్‌పాస్ట్‌లా తాగితే ఏం జ‌రుగుతుందంటే..!

పాలను ఏ టైంలో తాగాలి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లా పాలను తాగితే ఏం జరుగుతుంది..?
చాలామంది పాలను కూడా ఆహారంతో పాటుగా తాగుతూ ఉంటారు. పాలలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. పిల్లల నుంచి పెద్దవారు దాకా అందరూ రోజుకు ఒక గ్లాస్ పాలను తాగాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పాలని ఎప్పుడు తాగితే మంచిది అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. పాలను ఏ సమయంలో తాగడం వల్ల మనకి మరింత మేలు జరుగుతుందో.. పాలని తాగడం వల్ల మనకి కలిగే మేలు ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొందరు పాలను ఉదయం తాగుతారు.. మరికొందరు రాత్రిపూట పడుకునే ముందు తాగుతారు.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత పాలను తాగడం వల్ల మరింత మేలు జరుగుతుందని నిపుణులు తెలియజేశారు. ఉదయం పూట అల్పాహారంలో కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలలో కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాలను ఉదయం పూట తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చాలామంది ఉదయం పూట మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అలా గింజలు తో పాటుగా పాలని కూడా తాగినట్లయితే గ్లూకోస్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

పాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత కాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు, దంతాలు గట్టిగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు పాలు తాగించడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే పాలను తీసుకోవడం వల్ల ప్రోటీన్స్, పాస్పరస్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ,బి 12, రైబో ప్లేవిన్ కూడా పుష్కలంగా అందుతాయి. అంతేకాకుండా పాలను తాగడం వల్ల శరీరం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా పాలను ఉదయం పూట తాగినట్లయితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు సూచిస్తున్నారు.