ఆ కార‌ణంతోనే లావ‌ణ్య‌తో ల‌వ్‌లో ప‌డ్డాను… ఆ సీక్రెట్ చెప్పిన వ‌రుణ్‌తేజ్‌…!

మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలో మంచి ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరూ తర్వాత ప్రేమలో పడి ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్‌కి మంచి ట్రీట్ ఇచ్చారు. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు వ‌రుణ్‌. ఇటీవల వరుణ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్త డైరెక్షన్లో గాండీవధారి అర్జున్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్.

ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లావణ్యతో తన లవ్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. మా లవ్ స్టోరీ స్టార్ట్ అయి ఫైవ్ ఇయర్స్ అవుతుందని.. మొదట్లో మంచి స్నేహితులుగా ఉన్న మేము ఇద్ద‌రి టేస్ట్‌లు, ఒపీనియ‌న్‌లు కలవడంతో మా రిలేష‌న్‌ని మరి కాస్త ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నామని నాకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్‌లలో లావణ్య త్రిపాఠి ఒకటి అంటూ చెప్పుకొచ్చాడు. ముందు నేను ఆమెకు ప్రపోజ్ చేశాను. దానికి ఆమె ఓకే చెప్పింది. తర్వాత ఇద్దరం ఇరు కుటుంబాల్లో మా ప్రేమ విషయాన్ని చెప్తే వారు కూడా ఓకే చేశారు.

మా నిర్ణయాన్ని గౌరవించి అంగీకరించారు అంటూ చెప్పుకొచ్చాడు. లావణ్య నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది.. నేను వాడుతున్న ఫోన్ ఆమె ఇచ్చిందే అంటూ చెప్పిన వరుణ్‌ నాకు ఏది కావాలో ఏది ఇష్టమో లావణ్య కు బాగా తెలుసు ఆమెకి అవె ఇష్టం. లావ‌ణ్యా చాలా మెచ్చ్యూర్డ్‌ గా ఆలోచిస్తుంది. మా ప్రేమ విషయం ఇన్నాళ్లు దాచి పెట్టడానికి కారణం నేను కొన్ని విషయాలను ఎప్పుడు పర్సనల్ గా ఉంచడానికి ఇష్టపడటం.. అందుకే ఇన్నాళ్లు ఈ విషయం బయటకు రాలేదు అని చెప్పాడు. ఈ నేప‌ద్యంలో తన పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చాడు ఎంగేజ్మెంట్ మాదిరిగానే పెళ్లి కూడా సింపుల్గా చేసుకుంటాం అంటూ వివరించాడు.