మహేష్ కోసం మ‌ళ్లీ వ‌స్తోన్న ఆ హాట్ హీరోయిన్‌… గుంటూరు కారంలో స్పెష‌ల్ సాంగ్‌..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ” గుంటూరు కారం “. మహేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా సరికొత్త స్టోరీ తో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అనేక భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చెస్తోంది.

ఇది ఎలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజా సమాచారం ఏమిటంటే ఈ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ నటి మహేష్ బాబుతో జతకట్టి భరత్ అనే నేను చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.