స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఇంతమంది హీరోలతో ఎఫైర్లు నడిపిందా… ఇంత‌కి ఆ హీరోలు ఎవ‌రంటే..!

ఏ తరం ప్రేక్షకుల కైనా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు సిమ్రాన్.. గతంలో తన నడుము అందాలతో కవ్విస్తూ తెలుగు తో పాటు అన్ని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో కలిసి నటించింది సిమ్రాన్. టాలీవుడ్ లో బాలకృష్ణ నుంచి మహేష్ బాబు వరకు ఇలా ఎందరో స్టార్ హీరోలతో ఆడిపడింది. అదేవిధంగా తన అందచందాలతో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. అదే విధంగా సిమ్రాన్ తన సినిమాలతోనే కాకుండా తన పర్సనల్ లైఫ్ లో కూడా ఎందరో హీరోలతో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో పలు వార్తలు వ‌చ్చాయి మరి అందులో ఎంతవరకు నిజం ఉందో కానీ సిమ్రాన్ తో ఎఫైర్ అంటూ వచ్చిన ఆ హీరోలు ఎవరో ఇక్కడ చూద్దాం.

సిమ్రాన్ తన సినీ జీవితంలో ఎందరో హీరోలతో ఎన్నో విజయాలను అందుకుంది. అలా సిమ్రాన్ కు వరుస విజయాలు ఇచ్చిన హీరోలలో లోకనాయకుడు కమలహాసన్ కూడా ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో బ్రహ్మచారి, పంచతంత్రం వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలు వచ్చాయి. ఆ సమయంలోనే సిమ్రాన్ కమలహాసన్ మధ్య ఏదో నడుస్తుందనినే వార్తలు బాగా వినిపించాయి. అంతే కాకుండా సిమ్రాన్- కమల్ హాసన్ ను పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరకు అందులో నిజం లేదని తేలిపోయింది.

ఆ తర్వాత సిమ్రాన్ కోలీవుడ్లో తన తొలి సినిమా నుంచి మరో హీరో అబ్బాస్ తో మంచి పరిచయం ఏర్పరచుకుంది. ఇద్ద‌రు కలిసి కొన్ని సినిమాల్లో కూడా జంటగా నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్త‌లు కూడా వచ్చాయి. ఇక అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై సిమ్రాన్ మాట్లాడుతూ మ‌ద్య‌ ఎలాంటి సంబంధం లేదు ఒక స్నేహం మాత్రమే ఉంది అంటూ ఆ వార్త‌లను కొట్టి పడేసింది.

మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో కలిసి వాలి సినిమాలో నటిస్తున్న సమయంలో సిమ్రాన్ అతనితో ప్రేమలో పడింది అంటూ పలు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఇద్దరు ఖండించడంతో ఇది నిజం లేదనిని తేలిపోయింది. తర్వాత అజిత్ లైఫ్ లోకి శాలిని ఎంట్రీ ఇవ్వటంతో సిమ్రాన్ ని పట్టించుకోవడం మానేశారు. ఇక తెలుగు లో ఎక్కువగా బాలకృష్ణ సినిమాల్లో నటించిన సిమ్రాన్, బాలయ్య తో ఆన్ స్క్రీన్ రొమాంటిక్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బాలయ్య బాబుతో సమారా సింహ రెడ్డి, నరసింహ నాయుడు, గొప్పింటి అల్లుడు , సీమ సింహం వంటి సినిమాల్లో కలిసి నటించింది. ఈ సినిమాల్లో నటిస్తున్న క్రమం లో వీరిద్దరి మధ్య ఎదో ఉందంటూ కొన్ని వార్తలు రావడం విశేషం. అవి నిజామా కాదా అనే విషయం తెలియకపోయిన సిమ్రాన్, బాలయ్య బాబు కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు రావడం వల్ల ఈ వార్తలకు బలం చేకూరింది.