టైగర్ నాగేశ్వరరావు పై అదిరిపోయే అప్డేట్..!

మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి.. ఓ అప్డేట్ వచ్చింది. రవితేజ లిస్టులో ఎన్నో సినిమాలు ఉన్న రవితేజ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాటిలో టైగర్ నాగేశ్వరరావు మూవి ఒకటి. ఈ సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయకులుగా నటిస్తున్నారు. 1970 లో స్టువర్టుపురంలో గజదొంగగా పేరు గాంచిన నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం గురించి మరో అప్డేట్ రానుంది. ఆగస్టు 17న టైగర్ దండయాత్ర అంటూ టైగర్ నాగేశ్వరరావు మూవీ టీం ఇటీవల ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ దండయాత్ర ఏంటనేది క్లారిటీ ఇవ్వలేదు. ఆగస్టు 17న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు టైగర్ నాగేశ్వరరావు రవితేజను తర్వాత వారం చూడండి.. ఆగస్టు 17న టీజర్ దండయాత్ర అని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వాళ్ళు ఆగస్టు 12న ట్వీట్ చేశారు.

రవితేజ ఓ కుర్చీ పై పాదం మోపిన ఫోటోతో పోస్ట్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే…. ఓ ఓటిటి ప్లాట్ ఫామ్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టైగర్ నాగేశ్వరరావు సినిమాని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నాడు‌. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రేణు దేశాయ్ ఈ మూవిలో కీలకపాత్ర వహిస్తుంది. చాలా కాలం తరువాత ఆమె తెలుగు సినిమా చేస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.