ఆ స్టార్ హీరో అంటే తనకు ప్రాణం అంటున్న శ్రీలీల.. ఆ కోరిక ఉందంట!

డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చాలా మంది అంటారు. అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసి యాక్టింగ్ ప్రొఫెషన్‌లో రాణిస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అందులో యంగ్ బ్యూటీ శ్రీలీల ముందుంటుంది. ఓ వైపు చదువు పూర్తి చేయడంతో పాటు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని కెరీర్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుందీ కన్నడ బ్యూటీ. 2019లోనే రెండు కన్నడ సినిమాలు చేసినా, హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత రవితేజ సరసన ధమాకా చేసి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.

ఈ యంగ్ బ్యూటీ సరసన నటించేందుకు చాలా మంది హీరోలు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో తెలుగులోనే కాకుండా కన్నడలోనూ ఆమె వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటోంది. ఎంతో మంది హీరోలకు ఛాయిస్‌గా మారిన ఈ హీరోయిన్‌కు ఇష్టమైన హీరో సూర్య అంట. సూర్య అంటే తనకు ప్రాణమని, ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఆమెతో ఎంతో మంది నటిస్తున్నా, తెలుగు, కన్నడ హీరోలను కాదని ఆమె సూర్య పేరును చెప్పడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయినా సూర్య అంటే ఇష్టపడని వారు ఉండరు. తనను తక్కువగా చూసినా, కించపరుస్తూ కామెంట్లు చేసినా ఓర్పుతో ఉండడం సూర్య లక్షణం. ఇదే కోవలో వరుస హిట్ సినిమాలు చేస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకునే హీరో సూర్య. అందుకే శ్రీలీల సైతం ఆయనంటే ఇష్టపడిందని తెలుస్తోంది. ఏదేమైనా సూర్యతో సినిమా చేసే అవకాశం రావాలని ఈ కన్నడ బ్యూటీ కోటి ఆశలతో ఎదురు చూస్తోంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇవే కాకుండా బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంధ, నితిన్ సరసన వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఓ సినిమా, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా, నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇంతలా బిజీగా ఉన్న హీరోయిన్ తెలుగులో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.