ఆ హీరోయిన్ వల్లే ముగ్గురు హీరోల కెరీర్లు నిలపడ్డాయి..ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతున్నారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకొని కొత్త రికార్డు లను సృష్టించారు. అయితే తెలుగులో ఈ ముగ్గురి కెరీర్ ను మార్చిన సినిమాలు మూడు ఉన్నాయి. అయితే విశేషం ఏంటంటే ఈ ముగ్గురి కెరీర్ టర్నింగ్ అయిన సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే. ఈ సినిమాల తరువాత ఆ హీరోల కెరీర్ తారాస్థాయికి చేరింది. ఇంతకు ఆ సినిమాలు ఏంటి..ఆ హీరోయిన్ ఎవరో గుర్తొచ్చిందా.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అయితే బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత హిట్ ల కోసం చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఖుషి. ఈ సినిమా 2001 లో విడుదలైన ఇప్పటికి ఈ సినిమా అంటే నచ్చని వారు ఉండరు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని పాటలు అయితే ఇప్పటికి పవన్ అభిమానులకు ఫేవరెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా భూమిక నటించింది.

మహేష్ బాబు కెరీర్ లో ఒక్కడు కీలక మలుపు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ ని మార్చేసింది అనే చెప్పాలి. కొండారెడ్డి బురుజు వద్ద ప్రకాష్ రాజ్ ని కొట్టే సీన్ ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు. 2003 లో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మహేష్ బాబుని నెంబర్ 1 హీరోగా మార్చేయడమే కాకుండా మాస్ ఆడియన్స్ లో కూడా మహేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో టర్నింగ్ పాయింట్ సినిమాలు ఉన్నా ఒక్కడు మాత్రం ఎప్పుడు ముందుంటుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా భూమిక నటించింది.

జూనియర్ ఎన్టిఆర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. RRR తో గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఇక తరువాత వచ్చే ప్రాజెక్ట్స్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టిఆర్ కెరీర్ ని మార్చేసిన సినిమా సింహాద్రి అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో 2003 లో ఈ సినిమా విడుదలై సంచలనాలు సృష్టించింది.ఈ సినిమాతో ఎన్టిఆర్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. టాప్ పోసిషన్ లో నిలబెట్టింది. ఈ సినిమాలో ఎన్టిఆర్ కు జోడిగా భూమిక నటించింది.

ఇక ఆ హీరోయిన్ ఎవరో అప్పుడే అందరికి అర్థం అయ్యి ఉంటుంది. ఈ మూడు సినిమాల్లో మనకి కనిపించిన కామన్ పేరు భూమిక. అవును ఈ ముగ్గురు స్టార్ కెరీర్ ని మార్చేసిన సినిమాల్లో భూమిక హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు భూమికకి అవకాశాలు, క్రేజ్ లేకపోయినా ఒకప్పుడు మాత్రం భూమిక స్టార్ హీరోయిన్ గా ఉండేవారు. ఇప్పుడు ఈ సినిమాలు రీరిలీజ్ అయ్యి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అప్పట్లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న భూమిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుంది.