ఫొటోలతో హీటెక్కిస్తున్న ప్రగ్య.. పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత

హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ అనగానే మనకు కంచె సినిమా గుర్తుకు వస్తుంది. గొప్పింటి అమ్మాయిగా ఆ సినిమాలో నటించిన ఆమె ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించే అమ్మాయిగా, పద్ధతి గల అమ్మాయిగా చీరలో కనిపించి చాలా మంది గుండెను గుల్ల చేసింది. ఇప్పటికీ ఆ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సీత పాత్రలో ఆమెను ఎవరూ మర్చిపోలేరు. ఆమె చీరకట్టుకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏమోయ్ ఏమోయ్ అంటూ ఆమె పలికిన పలుకులకు చాలా మంచి పడిపోయారు. ఇక ఆ తర్వాత ఆమె తన పద్ధతి మార్చింది. తనలో గ్లామర్ కూడా చాలా ఉందని ప్రేక్షకులకు తెలిసేలా చేయాలనుకుంది. జయ జానకి నాయక సినిమాలో సిటీ కల్చర్ బాగా అలవాటు పడ్డ అమ్మాయిగా కనిపించింది. పొట్టి దుస్తుల్లో రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత ఆమె సినీ కెరీర్ ఆశించినంతగా సాగలేదు.

ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో కనిపించింది. కలెక్టర్ పాత్రలో ఒదిగిపోయింది. ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా ఆమె వరుస ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటోంది. కురచ దుస్తుల్లో అందాలు ఆరబోస్తోంది. ఇటీవల ఆమె తన వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెనుక నది, కొండలు, అందమైన ప్రకృతి కనిపిస్తోంది. ఆమె మాత్రం నిక్కరు వేసుకుని అక్కడ ఫొటోలు దిగింది.

బహుశా చుట్టూ ఎన్ని అందాలున్నా అంతా ఆమె అందాలనే చూస్తారనడంలో సందేహం లేదు. ఇలా పొట్టి నిక్కరు వేసుకుని తన థైస్ అందాలను ప్రదర్శించింది. తాను అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకాడబోననే సంకేతాలు సినీ వర్గాలకు పంపింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు లైక్‌లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.