విడాకులకు సిద్ధమైన గజినీ ఫేమ్ ఆసిన్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాహాలతో పాటు విడాకుల కార్యక్రమాలు కూడా ఎక్కువైపోతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ ఆసిన్ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందనే దాని గురించి తెలియాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ లో ఆసిన్ కూడా ఒకరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించి తెలుగు తెరకు పరిచయం అయింది ఆసిన్.

ఈ అమ్మడు నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో వరుస అవకాశాలు వచ్చి చేరాయి. అంతేకాకుండా ఆసిన్ నటించిన సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. దాంతో నాగార్జునతో ‘శివమణి ‘, బాలకృష్ణతో లక్ష్మి నరసింహా, వెంకటేష్ సరసన ఘర్షణ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. కానీ పవన్ కళ్యాణ్ తో నటించిన అన్నవరం, ప్రభాస్ తో నటించిన చక్రం లాంటి సినిమాలు ఈమెను కాస్త నిరాశ పరిచాయి. టాలీవుడ్ లో మంచి స్థానం సంపాదించుకున్న ఆసిన్ తమిళ్ లో గజినీ సినిమాతో స్టార్డం తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా ప్రముఖ బిజినెస్‌ మ్యాన్ రాహుల్ శర్మను 2016లో వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఆసిన్ భర్త రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ కంపెనీకి సీఈఓ గా పనిచేశాడు. పెళ్లి తర్వాత చాలా కాలం హ్యాపీగా ఉన్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు వస్తున్నాయట. అందుకే ఆసిన్,రాహుల్ శర్మ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. రాహుల్ శర్మ కొన్నేళ్లుగా వేరే అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడట. ఆ విషయం తెలిసిన ఆసిన్ అతన్ని ఒకటి రెండుసార్లు హెచ్చరించిందట. అయినా కూడా అతను వినకపోవడం తో ఆసిన్ తన భర్తకు దూరంగా ఉంటుందట. అయితే ఆసిన్ కి ఒక పాప కూడా ఉంది అయినప్పటికీ తన భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇంకా ఎవరికి తెలియదు.