ప్రియంక వేసుకున్న ఈ నెక్ సెట్ ధర ఎంతో తెలుసా..? మన తెలుగుహీరోలు నాలుగు సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్..!!

అందాలు ఆరబోయడంలో ఎంతోమంది స్టార్స్ ముందు వరుసలో ఉంటారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా విభిన్నంగా కనిపిస్తూ ఉంటుంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా . బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక ..ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్లో బడాబడా ఆఫర్స్ పట్టేస్తూ వచ్చిన ప్రియాంక చోప్రా .. అక్కడ పలు ఈవెంట్స్ లో కూడా మెరిసి హాలీవుడ్ జనాలకి తన అందాలను ఎరగా వేస్తుంది .

మరి ముఖ్యంగా రీసెంట్గా అటెండ్ అయిన ఓ ఈవెంట్లో ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ న్యూయార్క్ గాలా 2023లో పాల్గొనింది ప్రియాంక చోప్రా . ఈ క్రమంలోనే రెడ్ కార్పెట్ పై ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి వాక్ చేసింది . మరి ముఖ్యంగా అక్కడ అంత మంది హాలీవుడ్ – బాలీవుడ్ బ్యూటీస్ ఉన్నా సరే అందరూ కళ్ళు ప్రియాంక చోప్ర పైనే పడడానికి మెయిన్ రీజన్ ఆమె ధరించిన నెక్ సెట్.. వేసుకున్న బ్లాక్ లాంగ్ ఫ్రాక్ .

ఆ డ్రెస్ ఏ విధంగా ఉందో ఈ ఫొటోస్ చూస్తే మీకే అర్థమయిపోతుంది . బాడీ పార్ట్స్ మొత్తం ఎక్స్పోజ్ అయ్యే విధంగా క్లియర్ గా చూపించేస్తుంది ప్రియాంక చోప్రా . మరీ ముఖ్యంగా ఆమె వేసుకున్న నెక్ సెట్ రేటు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది . అక్షరాల 204 కోట్లు విలువ చేస్తుంది అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే బల్గారి 11.6 క్యారెక్ట్ డైమండ్ నెక్లెస్ ను ఆమె ఈవెంట్ లో ధరించినట్లు వైరల్ అవుతుంది . అంతేకాదు ఈ లెక్కన చూసుకుంటే మన తెలుగు చిన్న హీరోలు నాలుగు సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్ అంటూ ప్రియాంక చోప్రా పిక్స్ ని వైరల్ చేస్తున్నారు జనాలు..!!

Share post:

Latest