మాస్ మహారాజా రవితేజ గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోగా మారిన రవితేజ.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు.
ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న రవితేజ.. ఇప్పుడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. సుధీర్ వర్మ రూపొందించిన క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. రవితేజ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. రవితేజ అసలు పేరు రవి శంకర్ రాజు భూపతి రాజు. ఈయన స్వస్థలం భీమవరం.
2002 వ సంవత్సరం లో తేజస్విని అనే అమ్మాయితో రవితేజ ఏడుడుగులు వేశాడు. ఈ దంపతులకు ఒక కూతురు, కుమారుడు జన్మించారు. కొడుకు మహాదన్.. ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. ఇక కూతురు పేరు మోక్షద.
ఈమె ఎంతో అందంగా ఉంటుంది. పలువరు హీరోయిన్లు కూడా మోక్షద ముందు దిగదుడపే. సోషల్ మీడియాలో పెద్దగా కనిపించని మోక్షద.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని స్టడీస్ పైనే పెట్టింది. అయితే ఫ్యూచర్ లో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.