మహేష్ రాజమౌళి షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న ఈ దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రీ లుక్ నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఫ్రీల్ కు రిలీజ్ చేసిన అభిమానులు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు..

Mahesh Babu thrilled about his next with SS Rajamouli, says it's going to  be massive - India Today
త్వరలోనే ఈ సినిమా నుంచి మరొక క్రేజీ అప్డేట్ రాబోతోంది .ఇక ఈ సినిమాలో మహేష్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.ఒకరు పూజా హెగ్డే కాక మరొకరు శ్రీ లీల.. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారని సమాచారం. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది ఇప్పటికి ఈ చిత్రం గురించి వర్క్ మొదలయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి త్వరలో కూడా మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం..

ఇక మహేష్ బాబు చేస్తున్న సినిమా వచ్చే జనవరి 13న విడుదల కాబోతోంది ఈ సినిమా విడుదలైన తరువాత రాజమౌళి సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభించాలని రాజమౌళి అనుకుంటున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి క్లారిటీ కూడా చిత్ర బృందం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.