కోనసీమలో వైసీపీ గ్రాఫ్ డౌన్..ఆ రెండు కలిస్తే కష్టమే.!

గత ఎన్నికల్లో వైసీపీ నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో స్వీప్ చేసింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఎక్కువగా ఉంది..అందుకే స్వీప్ చేసేసింది..మరి ఈ సారి అదే పరిస్తితి ఉంటుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది..అటు టి‌డి‌పి బలపడుతుంది. అదే సమయంలో జనసేనతో కలిస్తే వైసీపీకి రిస్క్ ఎక్కువ.

ఇంకా చెప్పాలంటే టి‌డి‌పి-జనసేన గాని కలిస్తే కొన్ని కొత్త జిల్లాల్లో స్వీప్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలా స్వీప్ చేయడానికి ఛాన్స్ ఉన్న కొత్త జిల్లా వచ్చి కోనసీమ..అమలాపురం పార్లమెంట్ పరిధి. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వైసీపీకి బలం తగ్గుతూ ఉంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న 7 స్థానాల్లో వైసీపీ 5 గెలుచుకుంది. రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, కొత్తపేట స్థానాలని వైసీపీ గెలుచుకోగా, మండపేట టి‌డి‌పి, రాజోలు జనసేన గెలుచుకున్నాయి. రాజోలులో గెలిచిన జనసేన ఎమ్మెల్యే..తర్వాత వైసీపీ వైపుకు వెళ్లారు.

ఇలా కోనసీమలో వైసీపీ హవా నడుస్తుంది..కానీ ఈ సారి ఎన్నికల్లో వైసీపీ హవా నడిచేలా లేదు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. అటు టి‌డి‌పితో పాటు జనసేన కూడా బలపడుతుంది. కాకపోతే ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకి కాస్త బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే మాత్రం కొనసీమలో స్వీప్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Share post:

Latest