Project -k నటీనటుల రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్ట్ -k. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతోంది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించడం జరుగుతోంది .వచ్చే ఏడాది ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమానే కాకుండా పాన్ వరల్డ్ మూవీ గా కూడా తెరకెక్కించడం జరుగుతోంది. మొదటినుంచి చిత్ర బృంద ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని సరికొత్త ప్రపంచం లోకి తీసుకు వెళుతుందని తెలియజేస్తున్నారు.

ఇక ఈ సినిమా యొక్క బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.. కానీ ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల యొక్క రెమ్యూనరేషన్ తెలిస్తే ఓ రేంజ్ లో ఉన్నాయన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియా నుంచి ఒక సంస్థ ప్రకటించిన కథనం ప్రకారం ఇందులో దీపికా పదుకొనే నటించడానికి తీసుకున్న రెమ్యూనరేషన్ దాదాపుగా రూ.10 కోట్ల రూపాయలు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అమితాబచ్చన్ పారితోషకం అంతకు రెట్టింపు అనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇక ప్రభాస్ యొక్క రెమ్యూనరేషన్ రూ .100 కోట్లకు పైగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరో హీరోయిన్స్ ఇతర నటీనటుల యొక్క రెమ్యూనరేషన్ లెక్కలు షాక్ అయ్యే విధంగా ఉన్నాయని తెలుస్తోంది. బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2000 కోట్ల టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రాజెక్ట్ -k సినిమా కోసం దేశవ్యాప్తంగా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Share post:

Latest