Womens day: ఈ హీరోయిన్స్ కి ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా..?

ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి వారి ఘనత గురించి ప్రతి ఒక్కరు పలు రకాలుగా తెలియజేస్తున్నారు.ఒకప్పుడు మహిళలను చిన్న చూపు చూసేవారు. ఈ మధ్యకాలంలో చాలావరకు చిన్న చూపు చూడటం తగ్గిందనే చెప్ప వచ్చు. మహిళలు ఎందులోనూ తీసిపోరని కొంతమంది హీరోయిన్లు నిరూపించారు. హీరోయిన్లే కాదు బయట మహిళలు కూడా పోటాపోటీ పడి పురుషులకంటే స్త్రీలు తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ విషయానికొస్తే మానసికంగా శారీరికంగా తాము హీరోలకు సమానం అని నిరూపించారు. అందులో సమంత, సోనాలి బింద్రే, మమతా మోహన్దాస్, హంస నందిని ఇలా కొందరు హీరోయిన్స్ ఉన్నారు.

After Samantha Ruth Prabhu's Myositis diagnosis, Malayalam actress Mamta  Mohandas gets diagnosed with autoimmune disease Vitiligo | Hindi Movie News  - Bollywood - Times of India

ఇక ఇప్పుడు ఎంతోమంది హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తున్నారు. హీరోల స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నారు. సమంత యశోద సినిమాతో తను ఎంత స్ట్రాంగ్గో నిరూపించింది. ఇటీవల కూడా వెబ్ సిరీస్ షూట్ సందర్భంగా చేతికి అయిన గాయాలను సమంత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ మానసికంగా దూరంగా ఉండటంతో చావుతో పోరాటం సాగించి మళ్లీ మన ముందుకు వచ్చారు.

ఈ మధ్యకాలంలోనే సుస్మితాసేన్ గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలో అభిమానులు చాలా టెన్షన్ పడ్డారు. సుస్మిత మాత్రం నేను బతుకుతాను బతకాలి అని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చావుతో పోరాటం చేసి బయటపడింది. సమంత మయోసైటీస్ అనే దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నది అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న తరువాత ధైర్యంగా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది సమంత.

మమత మోహన్ దాస్, సోనాలి బింద్రే,హంస నందిని వీరంతా క్యాన్సర్ బారినపడి కోలుకున్నవారే ఇప్పుడు వీరు సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారి యొక్క మానసిక స్థితి బలమైనది కనుక చాలా స్పెషల్గా నిలిచారు.