గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కువగా RRR చిత్ర బృందం మొత్తం అమెరికాలోని తెగ సందడి చేస్తున్నారు. ఆస్కార్ వేడుకను తాజాగా ముగించుకొని ఫ్యామిలీతో కలిసి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు RRR టీం. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాలో సందడి చేశారు. ఆస్కార్ వేడుకలలో కూడా ఉపాసన మెరిసింది. తాజాగా రామ్ చరణ్ ఒక వీడియో అని రిలీజ్ చేయడం కూడా జరిగింది.ఈ వీడియోలో రామ్ చరణ్ ఉపాసన అమెరికాలో ఇంట్లోనే ఒక దేవుడికి దండం పెట్టుకుంటున్నారు.
ఒక చిన్న బాక్సులో రాముడు ,లక్ష్మణుడు ,సీతాదేవి ఆంజనేయస్వామి, లక్ష్మీదేవి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. దీనిని చూపిస్తూ రామ్ చరణ్ నేను ఉపాసన ఎక్కడికి వెళ్లినా సరే కచ్చితంగా దీనిని వెంటపెట్టుకొని వెళ్తాము.. మారోజు ప్రార్థన ఈ టెంపుల్ తోని మొదలవుతుంది అంటూ తన భక్తి గురించి తెలియజేయడం జరిగింది. రామ్ చరణ్ దంపతులు. రామ్ చరణ్ భక్తికి ఎక్కువ అన్నట్టుగా వీటిని చూస్తే అర్థమవుతొంది. సంవత్సరంలో చాలా రోజులు అయ్యప్ప మాల లోనే కనిపిస్తూ ఉండేవారు రామ్ చరణ్ ఇక రెగ్యులర్గా ఆంజనేయస్వామి శివుని ఆలయాలకు వెళ్లి పూజలు కూడా చేయిస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇలా విదేశాలకు వెళ్లిన దేవుడు విగ్రహాలను తీసుకువెళ్లి ఎక్కడికి వెళ్ళినా సరే తమ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా పూజలు చేస్తూ ఉండడంతో మెగా అభిమానులు రామ్ చరణ్ ఉపాసనలను తెగ అభినందిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.
. @alwaysramcharan shares with us a sacred ritual he shares with his wife😍 We are truly in love with this man! ❤️#ramcharan@alwaysramcharan#globalstarramcharan pic.twitter.com/ai1aElwNPW
— Ramesh Bala (@rameshlaus) March 14, 2023