వామ్మో..NTR -30 లో ఇద్దరు హీరోయిన్స్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఎన్టీఆర్ 30వ చిత్రం పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కించబోతున్నారు. ఈ నెల చివరన ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని కొరటాల శివ ఈ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అంటూ ఎన్నోసార్లు తెలియజేసింది ఈ అమ్మడు.

Record reach for NTR30, Janhvi Kapoor announcement | 123telugu.com
అయితే ఈ సినిమాలో కేవలం ఒక్క హీరోయిన్ ఎలా సరిపోతుంది అందుకే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథ డిమాండ్ మేరకు సెకండ్ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పుడు చిత్ర బృందం స్టార్ హీరోయిన్లలో ఒకరిని సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ చేసుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30వ సినిమా కోసం సెకండ్ హీరోయిన్ రేసులో రస్మిక ,పూజ హెగ్డే, మృనాల ఠాగూర్ ఉన్నట్లుగా టాకు వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే జాన్వీకి పోటీగా ఇందులో మరొక హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ కూడా ఇప్పటివరకు తన తదుపరిచిత్రం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. అటు కొరటాల శివ కూడా తన కెరీయర్ని మార్చేలా ఈ సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ వ్యవహరిస్తూ ఉండగా.. సంగీతాన్ని అనురుధ్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సెకండ్ హీరోయిన్ పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Share post:

Latest