బూతులు మాట్లాడి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ పొందిన వెంకటేష్.. ఎంత అంటే..

టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ వయసు పైబడ్డ తర్వాత కంటెంట్ డ్రివెన్ స్టోరీస్ మాత్రమే ఎంచుకుంటున్నాడు. దృశ్యం, గురు, నారప్ప వంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ప్రస్తుతం రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇందులో వెంకటేష్ బంధువు బాహుబలి ఫేమ్ రానా కూడా యాక్ట్ చేశాడు. వీరిద్దరూ తండ్రి కొడుకులుగా స్క్రీన్‌పై కనిపించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమ్ అవుతోంది. 2013 క్రైమ్ టీవీ సిరీస్ రే డోనోవన్ అఫీషియల్ రీమేక్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ చాలా కొత్త అవతారంలో కనిపించాడు. గ్రేషేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో వెంకటేష్ నటించిన కాక ఈ మూవీలో పచ్చి బూతులు మాట్లాడుతూ ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. ఈ విషయం పక్కన పెడితే ఒక కొత్త రోల్ లో వెంకటేష్ అద్భుతంగా నటించి చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు అతను చాలా డబ్బులను పారితోషికంగా పుచ్చుకున్నాడని సినీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఇలాంటి పచ్చి ముసలోడి పాత్రలో నటించినందుకు వెంకీ ఏకంగా రూ.12 కోట్లు సొంతం చేసుకున్నాడట. సీనియర్ హీరోకి ఇంత అమౌంట్ రావడం నిజంగా విశేషమే. ఇక రానా కూడా రూ.8 కోట్ల వరకు పుచ్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఏదేమైనా వెంకటేష్ డబ్బులు బాగానే వెనకేసుకున్నాడు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ తెలుగు, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. చూడాలనే ఆసక్తి ఉన్నవారు కాస్త ఒంటరిగా చూసేలా ప్లాన్ చేసుకోవడం బెటర్ అని ఆల్రెడీ చూసేసినవారు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో సెక్స్ సీన్స్, బూతులు ఉండాల్సిన దానికంటే శృతి మించి ఉన్నాయట. ఇక సిరీస్ స్టోరీ ఏమైనా ఆకట్టుకునేలా ఉందా అంటే అదీ లేదు అని పెదవిరుస్తున్నారు.

Share post:

Latest