వీరసింహారెడ్డి.. చిత్రానికి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా. మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన ఈ సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకున్న పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా పోటీకి రావడంతో ఈ సినిమాకు కాస్త మైనస్ అయిందని చెప్పవచ్చు. అయితే లాంగ్ రన్ టైంలో మాత్రం ఈ సినిమా రూ.75.41 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.

NBK107: సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'
ఈ చిత్రం బ్రేక్ ఈవెంట్ టార్గెట్ మాత్రం రూ.68 కోట్లు కావడంతో బిజినెస్ టార్గెట్ కంటే పది శాతం అత్యధిక కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటి లో స్ట్రిమింగ్ అవుతున్నది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియా వైస్ గా చూసుకుంటే.. నైజాం లో రూ.17.25 కోట్ల రూపాయలు.. సి డెడ్ లో రూ.16.48 కోట్ల రూపాయలు రాబట్టింది తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా దాదాపుగా రూ.64.78 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియాలో రూ.4.84 కోట్ల రూపాయలు.. ఓవర్సీస్ లో రూ.5.79 కోట్ల రూపాయలు దీంతో ఈ సినిమా ఓవరాల్ గా కలెక్షన్ల పరంగా రూ.75.41 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సమాచారం.

అయితే ఇదంతా కేవలం థియేటర్స్ ద్వారా వీర సింహారెడ్డి సినిమాకు వచ్చిన ఆదాయమే ఇక డిజిటల్ సాటిలైట్ డబ్బింగ్ రైట్స్ ద్వారా మైత్రి మూవీ వారికి మరింత లాభం వచ్చినట్లుగా తెలుస్తోంది మొత్తానికి అఖండ తర్వాత అంతటి రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ సినిమా అందుకుందని చెప్పవచ్చు.

Share post:

Latest