ట్రైలర్: నాని నట విశ్వరూపం చూపించాడుగా..!!

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం దసరా ఈ సినిమాని డైరెక్టర్ శ్రీకాంత్ వదిన దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో దాదాపుగా ఐదు భాషలలో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సైతం స్వేచ్ఛకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు నాని ఇలాంటి క్యారెక్టర్లలో నటించలేదని తెలుస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ను గడిచిన కొన్ని నిమిషాల క్రితం విడుదల చేయడం జరిగింది.

Dasara trailer: Nani's film is a blood-soaked story of man's uprising - Hindustan Times

ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో నాని మాస్ లుక్కులో అదరగొట్టేసాడు అని చెప్పవచ్చు. కీర్తి సురేష్ కూడా మరొకసారి డీ గ్లామర్ తో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక నాని నటించిన గత సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే దసరా సినిమా మరొక ఎత్తు అనిపించేలా కనిపిస్తోంది ట్రైలర్ విషయానికి వస్తే వెన్నెల వచ్చిందిరా ధరణిగా పెట్టి పుట్టావు రా నా కొడకా అంటూ కీర్తి సురేష్ డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.

బొగ్గు గనుల మధ్య నాని మాస్గా ఎంట్రీ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమా లో కూడా నాని ఆవారాగా తిరిగే వ్యక్తిగా కనిపిస్తున్నారు.ఇక అసలు ధరిని చేసిన తప్పు ఏంటి దాని ద్వారా నష్టపోయింది ఎవరు ఆ తప్పును ఎలా సరి చేస్తారు అని నేపథ్యంలో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. మొత్తానికి నాని ఈ సినిమాలో హైలెట్ గా కనిపిస్తున్నారు. మన భాషలో చెప్పాలి అంటే దసరా సినిమా ట్రైలర్ వన్ మ్యాన్ షో అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లోనే నాని నట విశ్వరూపాన్ని చూపించారని చెప్పవచ్చు మరి మొత్తానికి ట్రైలర్తో అభిమానుల అంచనాలను పెంచేసిన నాని సినిమాతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.<
/p>

Share post:

Latest